Signed in as:
filler@godaddy.com
Signed in as:
filler@godaddy.com

అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమా రానుంది. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణ దాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా..శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న భారీ చిత్రాన్ని ప్రకటించాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై స్పష్టత రానుంది.
నాగార్జున ఇప్పటికే వైల్డ్ డాగ్, బ్రహ్మాస్త్ర చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రవీణ్ సత్తారు బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేయాల్సి ఉండగా..ఇది ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
Copyright © 2020 News247 - All Rights Reserved.
Powered by GoDaddy Website Builder